Kadanna Preme Song Lyrics From Telugu Movie Manmadha....Enjoy!



Kadanna Preme Song Lyrics From Telugu Movie Manmadha....Enjoy!

Postby bsk0609 » Fri Feb 25, 2011 4:29 pm

Kadanna Preme song lyrics.... excellent song from telugu movie Manmadha...dedicated to you all..

Movie: Manmadha
Music: Yuvan Shankar Raja
Singer: S. P. Charan

కాదన్నా ప్రేమే...అవునన్నా ప్రేమే...
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే... నీడైనా ప్రేమే...
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీ మనసులో పూసే పూవుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లొ సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో..
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో..
నా పాప లాగా కళ్ళల్లో దాచానో..
నా గుండె నీకే ఇల్లల్లే చెశానో..
నా ప్రేమా...

కాదన్నా ప్రేమే...అవునన్నా ప్రేమే...
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్న
తోడైనా ప్రేమే... నీడైనా ప్రేమే...
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

పూల మనసులో..గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా
మేఘ మాలలో మెరుపు తీగవై నీవు పలికితే ప్రణయాలా
శతకోటి కాంతలొస్తే.. భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు దోచిన జోలగా....
నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
తండ్రి నీవెఐ పాలించు.. తల్లి నీవెఐ లాలించు
తోడు నీడవై నను నడుపు.. గుండెల్లో కొలువుండే....దేవి
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో..
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో..
నా పాప లాగా కళ్ళల్లో దాచానో..
నా గుండె నీకే ఇల్లల్లే చెశానో..
నా ప్రేమా...

కాదన్నా ప్రేమే...అవునన్నా ప్రేమే...
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్న
తోడైనా ప్రేమే... నీడైనా ప్రేమే...
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీవు తప్ప నాకెవరు లేరులె ప్రాణమివ్వనా నీకోసం
అశలాంటి నీ శ్వాస తగిలితే బతికి వుండదా నా ప్రాణం
నీ మోము చూడకా... నా కనులు వాలవే...
విరహ వేళలో పగలు చీకటై పోయెనే...
తను మనహ్ ప్రాణాలన్నీ నీకు నేనర్పిస్తాలే
నీ కొరకు పుడితే చాలు మళ్ళీ... మళ్ళీ...
చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెరిగి పోకుండ గొడుగు వలే.. నేనుంటె వానెంతలే...
నా చిట్టి ప్రేమా...

కాదన్నా ప్రేమే...అవునన్నా ప్రేమే...
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్న
తోడైనా ప్రేమే... నీడైనా ప్రేమే...
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీ మనసులో పూసే పూవుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసుల్లొ వీచె గాలుల్లొ సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో..
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో..
నా పాప లాగా కళ్ళల్లో దాచానో..
నా గుండె నీకే ఇల్లల్లే చెశానో..
నా ప్రేమా...

bsk0609

 
Posts: 15
Joined: Fri Jan 28, 2011 11:16 pm

Return to Telugu Song Lyrics

 


  • Related topics
    Replies
    Views
    Last post

Who is online

Users browsing this forum: No registered users and 0 guests