ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు సందె వేళ పలికే నా లో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే