ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే |2| నీ కంటిలో నలక లో వెలుగు నే కనక మేను నేననుకుంటె ఎద చీకటే |హరీ| రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి |వేణువై|
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో |2| ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు |హరీ| రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి |వేణువై|